వేడుకగా సహపంక్తి భోజనాలు
హుబ్లీ: సమాజంలో అణగారిన వర్గాలతో సామూహిక భోజన నిర్వహణ వల్ల సమాజంలో సమాన భావం నెలకొంటుందని ఉవ్వినసింగ్లి విరక్త మఠం చెన్నవీర మహాస్వామి తెలిపారు. శ్రీ నీలప్ప గుడ్డప్ప సిరహట్టి సేవ సంస్థ లక్ష్మేశ్వర, శ్రీ శివాజప్ప, రామచంద్ర మారెట్టె బళగ, అడరకట్టి సంస్థలు ఆకలి గొన్న వారికి అన్నం పెట్టే లక్ష్యంతో లక్ష్మేశ్వరలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక భోజన సంకల్ప కార్యక్రమంలో స్వామి పాల్గొని మాట్లాడారు. నిర్వాహకులు కరియప్ప సిరహట్టి సునంద దంపతులు నిరాశ్రయులకు చేతనైన సహాయం అందిస్తున్నారని, వీరి సేవ ప్రశంసనీయమని అన్నారు. వీరి సేవలు హుబ్లీ ధార్వాడలో కాకుండా గదగ్‌జిల్లాలో కూడా విస్తరించడం హర్షనీయం అన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరళి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే గడ్డదేవరమఠ, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేషంగా అన్నదాన కార్యక్రమాన్ని స్వామి సన్నిధిలో నెరవేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment