బాలింతల మరణాలు బాధాకరం
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో, బళ్లారి పెద్దాస్పత్రిలో బాలింతల మరణాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. కాన్పు కి వెళ్తే కాటికి వెళ్లినట్టేనా అనే ప్రశ్నలు ఉదయించేలా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ శనివారం సాయంత్రం బళ్లారి జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఇటీవల నెల రోజుల నుంచి బళ్లారి జిల్లా బిమ్స్, ఇతర ఆస్పత్రుల్లో బాలింతల చావులకు సర్కారు నిర్లక్ష్యమే కారణమంటూ బీజేపీపీ నేతలు ఉపవాస సత్యాగ్రహాన్ని చేపట్టిన నేపథ్యంలో మంత్రి వచ్చారు. ముందుగా రాష్ట్ర మాజీ మంత్రి శ్రీరాములు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపవాస సత్యాగ్రహ శిబిరాన్ని మంత్రి సందర్శించారు. బాలింతల కుటుంబాలకు అండగా ఉంటామని శ్రీరాములు చెప్పారు.
ఔషధ కంపెనీల తప్పిదం: మంత్రి
మంత్రి స్పందిస్తూ మరణాలపై ఇప్పటికే ఉన్నతాధికారుల బృందంతో తనిఖీ నిర్వహించామన్నారు. ఔషధ కంపెనీల తప్పిదం ఉందని తెలిసిందని, ఈ ఘటనలపై బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ జరిపించి నివేదిక తెప్పిస్తామని చెప్పారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై చర్చిస్తామన్నారు. బాధితులకు ఎంత ఇచ్చినా వారి కన్నీళ్లు తుడవలేమన్నారు. మంత్రి విజ్ఞప్తితో శ్రీరాములు, నేతలు దీక్షను విరమించారు. తరువాత మంత్రి బిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పలువురు బాలింతలను పరామర్శించారు. వైద్యాధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు
పరిహారం అందిస్తాం
వైద్య ఆరోగ్య మంత్రి దినేష్ హామీ
బళ్లారికి రాక
Comments
Please login to add a commentAdd a comment