రైతు సంఘం పదాధికారుల ధర్నా
శ్రీనివాసపురం: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ అభిమానులు, రైతు సంఘం పదాధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరస్పరం చేయి చేసుకునేదాకా వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే కెఆర్ రమేష్‌కుమార్ అటవీ భూముల ఆక్రమణలపై అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పదాధికారులు తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కెఆర్ రమేష్‌కుమార్ ఫొటోతో అర్ధనగ్నంగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న రమేష్‌కుమార్ అభిమానులు రమేష్‌కుమార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ రైతు సంఘం పదాధికారులతో ఘర్షణకు దిగారు. ధర్నాలో రమేష్‌కుమార్ ఫొటో ఎందుకు పెట్టుకున్నారని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి, రైతు సంఘం పదాధికారులపై దాడికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ వర్గీయులు దాడికి దిగారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా నిర్వహించడానికి ముందుగా అనుమతులు తీసుకున్న తమపై అకారణంగా రమేష్‌కుమార్ అనుచరులు దాడులకు దిగారన్నారు.
అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మద్దతుదారులు
Comments
Please login to add a commentAdd a comment