సమయస్ఫూర్తికి చెన్నమ్మ శౌర్యప్రశస్తి
హుబ్లీ: కుందానగరి బెళగావికి చెందిన విద్యార్థిని స్ఫూర్తికి రాష్ట్ర ప్రభుత్వం సాహసబాలలకు అందించే కేళది చెన్నమ్మ ప్రశస్తిని ప్రదానం చేసి సత్కరించారు. బెళగావిలోని హిందీ బాలికల విద్యాలయంలో చదువుతున్న స్ఫూర్తి రైల్వే ట్రాక్ వద్ద వెళుతుండగా ఓ ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలనే నిర్ణయంతో ఎదురుగా వస్తున్న రైలు కింద పడి చనిపోవాలని ప్రయత్నించారు. అటుగా వెళుతున్న స్ఫూర్తి తక్షణమే ప్రమాదాన్ని పసిగట్టి గట్టిగా కేకలు పెట్టి అక్కడ ఉన్న ఇరుగుపొరుగు వారిని ఒక్క చోటకు చేర్చి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఆ ముగ్గురిని సంయమనం, స్ఫూర్తితో రక్షించినందుకు గాను స్ఫూర్తి విశ్వనాథ్‌కు ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో చెన్నమ్మ శౌర్య అవార్డును రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖమంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ప్రదానం చేశారు.
ఏఐతో ప్రతిభా పాటవాలు వృద్ధి
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించడం వల్ల కమ్యూనికేషన్ సిల్క్స్, పాలన నైపుణ్యం తదితర ప్రతిభా పాటవాలు పెంపొంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాగా వివిధ ఘటనల్లో సాహసాలతో పలువురి ప్రాణాలను కాపాడిన బాలబాలికలకు ఆమె ఈ అవార్డులను ప్రదానం చేశారు. బాలలకు శౌర్య ప్రశస్తి పేరున, బాలికలకు కేళది చెన్నమ్మ శౌర్య ప్రశస్తి పేరున అవార్డులను ప్రతి ఏటా ప్రభుత్వం సాహసబాలలకు ప్రదానం చేస్తుంది. కాగా బెళగావి విద్యార్థిని స్ఫూర్తి అవార్డును సాధించినందుకు గాను బాలికల విద్యాలయ అధ్యాపక బృందం, తోటి స్నేహితులు, బంధువులు, హితులు స్ఫూర్తిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment