జిల్లాతో విడదీయరాని అనుబంధం
● బిసి ఊట, సీ్త్ర శక్తి పథకాలకు జిల్లా
నుంచే మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ శ్రీకారం
రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బిసి ఊట, మధ్యాహ్న భోజనం, మహిళలకు సీ్త్ర శక్తి పథకాలను మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రారంభం చేశారు. 2001లో అప్పట్లో దేవదుర్గ తాలూకా అరకెర గ్రామంలో 1999–2004 మధ్య కాలంలో ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ సర్కార్‌లో విద్యా శాఖా మంత్రి హెచ్.విశ్వనాథ్, సీ్త్ర శక్తి పథకాన్ని నగరంలోని మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఒపెక్ ఆస్పత్రి, ఆర్టీపీఎస్ ఏడో యూనిట్‌ను ప్రారంభించారు. అప్పట్లో ప్రజా పనుల శాఖా మంత్రి ధరంసింగ్, జైళ్ల శాఖ మంత్రి మాజీ ఎంపీ రాజా అమరేశ్వర నాయక్, మాజీ ఎంపీ వెంకటేష్ నాయక్, దేవదుర్గ మాజీ శాసనసభ్యు డు యల్లప్ప అక్కరికి, సయ్యద్ యాసిన్, ప్రస్తుత చిన్న నీటిపారుదల శాఖా మంత్రి బోసురాజు మాన్వి శాసన సభ్యుడిగా, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు అప్పటి జిల్లాధికారిగా కుమార నాయక్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment