మృత్యు శకటమైన బొలేరో
కోలారు: కోలారు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుసగా మూడు బైక్‌లను బొలేరో వాహనం ఢీకొనగా, ఐదు మంది మరణించిన ఘటన ముళబాగిలు తాలూకా ఎన్ వడ్డహళ్లి– గుడిపల్లి మార్గమధ్యంలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం కోనగుంటవాసులు కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో ఒక బొలెరో అతి వేగంగా వచ్చి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని రోడ్డు పక్కన బోల్తా పడింది. బొలెరో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడమే దీనికి కారణం. బైక్‌లలో వెళ్తున్న వెంకటరామప్ప (45), భార్య అలువేలమ్మ (30), అప్పయ్య (40), భార్య గాయత్రి (35), రాధప్ప (45) మరణించారు. బైక్‌లు, బాధితులు దూర దూరంగా పడిపోయారు. బొలేరో డ్రైవర్ పరారయ్యాడు. జిల్లా ఎస్పీ బి.నిఖిల్, ముళబాగిలు, నంగలి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాలను అంబులెన్స్‌లలో ముళబాగిలు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు. ఒకే గ్రామానికి చెందిన 5 మంది మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
మూడు బైక్‌లను ఢీ..
రెండు జంటలు, మరొకరు మృతి
కోలారు జిల్లాలో ఘోరం
Comments
Please login to add a commentAdd a comment