పెచ్చులూడి పడి ముగ్గురికి గాయాలు
బళ్లారి రూరల్: దావణగెరెలోని చిగటేరి జిల్లాసుపత్రిలో భవనం పైనుంచి పెచ్చులూడి పెళ్లలు కిందపడి ముగ్గురు గాయపడిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. సంబంధీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగర జిల్లా హొళలు గ్రామానికి చెందిన ప్రేమక్క(46), కావేరి(36) దావణగెరె జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కను చూడడానికి వెళ్లారు. క్యాజువాలిటీ ముందున్న ఆసుపత్రి ముఖ ద్వారం వద్ద కూర్చున్నారు. అదే సమయంలో భవనం పైనుంచి పెచ్చులూడి పడడంతో ప్రేమక్క, కావేరి, చిన్నారి నేత్ర(2) గాయపడ్డారు. వెంటనే బాధితులను క్యాజువాలిటీకి తరలించి చికిత్స అందించారు. కాగా చిన్నారికి తలపైన, ఇద్దరు మహిళల్లో ఒకరికి వెన్నుపైన, మరొకరికి చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.
క్షతగాత్రుల్లో ఇద్దరు మహిళలు,
ఒక చిన్నారి
మరమ్మతులకు నోచుకోని దావణగెరె
జిల్లాసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment