బాలింతల మృతిపై సీఈఓ ఆరా
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతల మృతిపై భవిష్యత్తులో మరణాల నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే తాలూకాలోని చిక్కసూగూరులో ఇంటింటికెళ్లి వివరాలు సేకరించారు. మాన్వి తాలూకా రబ్బణకల్‌లో రక్తస్రావంతో మరణించిన తరుణంలో అధికారులు పరిశీలన జరిపారు. ఆశా, అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలతో చర్చించారు. రక్త బలహీనత, అపౌష్టికత వంటి వాటితో మరణిస్తున్న అంశాన్ని గమనించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో లభించే పెసలు, గుడ్డు, పాలు, వేరుశనగ, రవ్వల వంటి ఆహార పదార్థాల పంపిణీపై వివరాలు సేకరించారు. సీఈఓ వెంట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి మంజునాథ్‌ఽ, టీపీ ఈఓ చంద్రశేఖర్‌లున్నారు.
కాటికాపరులకు పరికరాలివ్వండి
రాయచూరు రూరల్: జిల్లాలోని వివిధ గ్రామాల్లోని శ్మశానాల్లో పని చేసే తమకు పరికరాలు అందించాలని కాటికాపరులు డిమాండ్ చేశారు. బుధవారం యరగేర జీపీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. శ్మశాన వాటిక కాటికాపరులను పంచాయతీ ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. నెలకు రూ.3 వేల వేతనాలు చొప్పున చెల్లించాలన్నారు. గోడేహాళ్‌లో శ్మశానం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. నల్లారెడ్డి, శివప్పలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment