బనశంకరి: సీబీఐ అధికారులమంటూ వృద్ధునికి ఫోన్‌లో బెదిరించి రూ.1.24 కోట్లు దోచుకున్నారు. వివరాలు.. బెంగళూరులోని వృద్ధుడు (83)కి అక్టోబరులో మోసగాళ్లు ఫోన్ చేశారు. ముంబై పోలీసులమని, మీ పేరుతో ఉన్న మరో ఫోన్ నెంబరులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మనీ లాండరింగ్ జరిగాయని భయపెట్టారు. సీబీఐ అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారని చెప్పారు. తరువాత మళ్లీ కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని, మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మీ బ్యాంక్ అకౌంట్‌ని పరిశీలించాలి. మేము అడిగిన వివరాలు అందించాలని ఒత్తిడి చేశారు. బాధితుడు నిజమే అనుకుని వారు చెప్పినట్టల్లా చేశారు. వృద్ధుని బ్యాంకు ఖాతా వివరాలను తీసుకుని అందులో నుంచి రూ.1.24 కోట్లు జమ చేసుకున్నారు. దర్యాప్తు తరువాత వెనక్కి ఇస్తామని చెప్పారు. రెండునెలలు గడిచినప్పటికీ డబ్బు తిరిగి రాకపోవడంతో ఇది మోసమని ఆయనకు అర్థమైంది. బాధితుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment