ధర తగ్గడంతో టమాటాల పారబోత
హొసపేటె: టమాటా ధర కుప్పకూలిన నేపథ్యంలో సమీపంలోని నింబళగెరె రైతు రోడ్డు పక్కన టమాటాలు పడేశారు. విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా నింబళగెరె గ్రామానికి చెందిన గబరి కాడప్ప తనకున్న 3 ఎకరాల భూమిలో టమాటా పంటను సాగు చేశారు. గత కొద్ది రోజులుగా వివిధ మార్కెట్లలో టమాటా బాక్స్ ధర రూ.200 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. అయితే బుధవారం హరపనహళ్లి మార్కెట్‌కు తీసుకెళ్లగా ఒక్క బాక్సు ధర రూ.30 నుంచి రూ.50 మాత్రమే అడిగారు. దీంతో తీవ్ర నిరాశకు చెందిన రైతు తన పొలం సమీపంలో రోడ్డు పక్కన పారేశారు. టమాట కోసేందుకు కూలి మహిళలకు రూ.200, పురుషులకు రూ.500 ఇవ్వాలి. అంతే కాకుండా వాహనం అద్దె, లోడింగ్, అన్‌లోడింగ్‌కు కూడా చెల్లించాల్సి ఉంటుందని, ఇంత ధర పెట్టి పండించిన టమాట పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరమన్నారు. ధర ఇంతలా తగ్గితే రైతులు ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment