ఉచిత విద్యతో అక్షరాస్యత వృద్ధి
రాయచూరు రూరల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలంటే పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉచితంగా విద్యా బోధన చేయాలని పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాబర్ అలీ పిలుపునిచ్చారు. బుధవారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సంవాద సభలో మాట్లాడారు. ప్రతి ఒక్క నాగరికుడిలో విద్యాభ్యాస తపన కలిగించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ గజానన ప్రసంగిస్తూ పిన్న వయస్సులోనే బాబర్ అలీ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహించి 8 వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేశారన్నారు. సమితి సంచాలకులు హఫీజుల్లా, విద్యా శాఖ అధికారులు బడిగేర, ఇందిర, చంద్రశేఖర్, రాజశేఖర్, రంగస్వామిలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment