జమిలీ ఎన్నికలు వద్దు
రాయచూరు రూరల్: సార్వభౌమతగల భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టడం సమంజసం కాదని సమాన మనస్కుల సంఘం సంచాలకుడు బేరి పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని స్పందన భనవంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కష్టపడి పని చేసే వారిపై సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ దళ్‌ల ప్రమేయంతో దేశంలో జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టడాన్ని ఖండించారు. మనువాది ఫాసిస్టు వ్యతిరేక జనతా రంగ రాయచూరు పేరుతో 14 సంఘాలతో ఆందోళనకు శ్రీకారం చుడతామన్నారు. సమావేశంలో జాన్‌వెస్లీ, మానసయ్య, విశ్వనాథ్ పట్టి, గంగాధర, అమరేష్, అమీర్, ఖాజా అస్లాంపాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment