మైసూరు: సినీ నటుడు దర్శన్ మంగళవారం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జామీను పొంది నగరంలోని టీ.నరసీపుర రోడ్డులోని ఫాంహౌస్‌లో ఆయన మకాం వేశారు. వెన్నునొప్పి, కాలునొప్పులకు చికిత్స పొందుతున్నారు. తాజాగా సరస్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. వెళ్లేటప్పుడు, కారులోకి వచ్చేటప్పుడు దర్శన్ కాలినొప్పితో కష్టంగా నడుస్తున్న దృశ్యం కనిపించింది. దర్శన్ వస్తున్నారని తెలిసి ఆస్పత్రి వద్ద అభిమానులు గుమిగూడి ది బాస్, ది బాస్ అని కేకలు వేశారు. అభిమానులకు చేయి ఊపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment