సమస్యగా అక్రమ వలసలు
సాక్షి, బెంగళూరు: చదువులు, ఉద్యోగాల పేరిట కర్ణాటకకు వస్తున్న విదేశీయులు వీసా గడువు ముగుస్తున్నా చట్టవిరుద్ధంగా ఇక్కడే ఉంటున్నారు. ఇలాంటివారు రాష్ట్రంలో మొత్తం 728 మంది ఉంటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులోనూ బెంగళూరులో ఎక్కువగా ఉన్నారు. చాలా మంది చదువు, వ్యాపారం, వైద్యం పేరుతో దేశానికి వచ్చి కర్ణాటకలో మకాం వేస్తున్నారు. కొంతమంది టూరిస్టుల్లా వచ్చి తిష్ట వేస్తున్నారు.
● వీసా అవధి ముగిసినా గత మూడేళ్ల నుంచి నైజీరియా, సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలు, యెమెన్ నుంచి సుమారు 728 మంది విదేశీయులు ఇక్కడ నివాసం ఉంటున్నట్లు హోం శాఖ వెల్లడించింది.
● వీరిలో కొందరు డబ్బు కోసం నేరాల బాట పడుతున్నారు. వారిలో వారు గొడవలకూ పాల్పడుతుంటారు. రాష్ట్రంలో ఇలా సుమారు 104 కేసులు విదేశీయులపై కేసులు నమోదయ్యాయి.
● వారి గురించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నట్లు హోం శాఖ తెలిపింది.
● ఇక బంగ్లాదేశీయులు కూడా అక్రమంగా దేశ సరిహద్దులను దాటుకుని కర్ణాటకకు వస్తున్నారు. బెంగళూరుతో పాటు మల్నాడు, కోస్తా జిల్లాల్లో కూలి పనుల్లో నిమగ్నమయ్యారు. స్థానికంగా ఆధార్ కార్డులను పొందడం గమనార్హం.
227 మంది వెనక్కి
బెంగళూరులో 2021లో 11, 2022లో ఆరుగురు, 2023లో 116 మంది, 2024లో 143 మంది విదేశీయులపై పలు నేరాల కింద కేసులు నమోదు చేశారు. బెంగళూరులో ఎక్కువగా డ్రగ్స్ దందాలో పాల్గొంటున్నారు. అనేకమంది ఆఫ్రికన్లు ఈ నేరాల కింద అరెస్టయి జైల్లో ఉన్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ రాష్ట్రంలో ఉంటూ అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్న 227 మంది విదేశీయులను రాష్ట్రం నుంచి పంపించేశారు.
రాష్ట్రంలో 728 మంది విదేశీయుల అక్రమంగా మకాం
నేరాలు, డ్రగ్స్ దందాల్లో కొందరు నిమగ్నం
నిఘా పెంచిన సర్కారు
Comments
Please login to add a commentAdd a comment