లోక రక్షకా.. శరణు దేవా
శివాజీనగర/ తుమకూరు: లోక రక్షకుడు ఏసు ప్రభువు ఈ భువిపై ఉదయించిన శుభదినమే క్రిస్మస్. రాష్ట్రమంతటా క్రైస్తవులు మంగళవారం రాత్రి నుంచి చర్చిలలో పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు. బాల ఏసు జననానికి గుర్తుగా అర్ధరాత్రి విశేష ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు బాల ఏసు విగ్రహానికి పూజలు చేసి క్రిస్మస్ విశిష్టతను వివరించారు. బెంగళూరు, మైసూరు, మంగళూరు సహా అనేక పట్టణాలు, పల్లెల్లో చర్చిలు క్రిస్మస్ శోభతో అలరారాయి. చర్చిలను సుందరంగా అలంకరించారు. ఆవరణలో క్రీస్తు జన్మించిన పశువుల పాకలను సుందరంగా తీర్చిదిద్దారు. అర్ధరాత్రి భక్తులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుని ఇళ్లకు పయనమయ్యారు. విద్యుద్దీప కాంతులతో చర్చిలు దేదీప్యమానమయ్యాయి. తుమకూరులోని శిరా గేట్ సమీపంలోని టమిల్‌సన్ చర్చిని తోరణాలతో సింగారించారు.
చర్చిలలో ఘనంగా క్రిస్మస్ ప్రార్థనలు
Comments
Please login to add a commentAdd a comment