ఉత్తమ పాలనే సుశాసన సప్తాహ ఉద్దేశం
కోలారు: సామాన్య ప్రజలకు ఉత్తమ పాలన అందించడమే సుశాసన సప్తాహ ముఖ్య ఉద్దేశమని డిప్యూటీ కలెక్టర్ మంగళ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో నిర్వహించిన సుశాసన సప్తాహ – ప్రశాసన గ్రామాల వైపునకు ఉత్తమ పాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉత్తమ పాలన అందించడం ప్రజా ప్రభుత్వ వ్యవస్థలో ప్రధానమని అన్నారు. దక్ష పాలన వల్లనే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా ప్రగతి సాధ్యం. కింది స్థాయి నుంచి మొదలుకుని పైవరకు ఉత్తమ పాలన అందించనప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని తగిన రీతిలో ఉపయోగించడం ద్వారా కార్యాలయాలలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రభుత్వ ఆశయం ప్రకారం ప్రజల సే వలు అన్నింటిని ఆన్‌లైన్, ఇ పాలన ద్వారా అందించడం జరుగుతోందన్నారు. సకాల పథక ద్వారా ఫిర్యాదులు స్వీకరించి నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడం జరుగుతోందన్నారు. కార్యాగారంలో ఉప విభాగఅధికారి డాక్టర్ మైత్రి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, హార్టికల్చర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment