ప్రైవేటు సంస్థ ఖాతాలకు కన్నం
కృష్ణరాజపురం: కార్పొరేట్ కంపెనీ డేటాను చోరీ చేసి కోట్లాది రూపాయల మేర స్వాహా చేసిన ప్రైవేటు బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురు మోసగాళ్లను బెంగళూరు తూర్పు విభాగం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శుభం వైభవ్ పితాడియా, శైలేష్, నేహా బెన్ అనేవారు నిందితులు. వారి నుంచి రూ.1.83 కోట్ల నగదును స్వాధీనపరచుకున్నారు.
ఎలా చేశారంటే..
గుజరాత్‌లో యాక్సిస్ బ్యాంకు మేనేజర్‌గా ఉన్న శుభం వైభవ్ పితాడియా కంపెనీ డేటాను చోరీ చేశాడు. తద్వారా ఇతర నిందితులతో కలిసి నకిలీ కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఏర్పాటు చేశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీ ఖాతాల నుంచి భారీ మొత్తంలో నగదును 17 గుర్తు తెలియని అకౌంట్లకు నగదును బదిలీ చేశారు. ఇలా సుమారు రూ. 12 కోట్లకు పైగా మళ్లించినట్లు సమాచారం. సదరు ప్రైవేటు కంపెనీ మోసం జరిగిపోయిందని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్టు చేశారు.
రూ. 12 కోట్లు మళ్లింపు!
బ్యాంకు మేనేజర్, మరో ఇద్దరు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment