మంత్రి ఖర్గే తప్పుకోవాలి
దొడ్డబళ్లాపురం: యువ కాంట్రాక్టరు ఆత్మహత్య కేసులో మంత్రి ప్రియాంక్ ఖర్గేకు వ్యతిరేకంగా కల్బుర్గిలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేశారు. శనివారం ఉదయం వందలాదిగా చేరిన బీజేపీ కార్యకర్తలు జగత్ సర్కిల్‌లో టైర్లకు నిప్పంటించి, వాహనాలను అడ్డుకుని రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి ప్రియాంక్ ఖర్గేకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కల్బుర్గి జిల్లాలో బీజేపీ కార్యకర్తలకు రక్షణ కరువైందన్నారు. బీజేపీ వారిని హత్య చేయడానికి కుట్రలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని, మంత్రి చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా మారారన్నారు. బీదర్‌లో ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ సచిన్ పాంచాళ డెత్‌నోట్‌లో బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులు హత్య చేయాలని కుట్రలు పన్నారని పేర్లతో సహా పేర్కొన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇన్స్‌పెక్టర్ షకీల్ బీజేపీ నాయకులను అమర్యాదగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నాడని, వెంటనే అతడ్ని సస్పెండ్ చేయాలని, మంత్రి ఖర్గే పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు.
ఖర్గే ఆప్తునిపై కేసు నమోదు
కాంట్రాక్టర్ సచిన్ ఆత్మహత్య కేసులో మంత్రి ఖర్గే అనుచరుడు, కార్పొరేటర్ రాజు కపనూర్‌పై కలబుర్గిలో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. కాంట్రాక్టర్ సచిన్ గురువారం బీదర్‌లో 7 పేజీల డెత్‌నోట్ రాసి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తనను రాజు సహా కొందరు డబ్బు కోసం వేధించారని డెత్ నోట్‌లో రాశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ మత్తిమూడ్‌తో సహా నలుగురు బీజేపీ నాయకులను చంపేస్తానని రాజు కపనూరు బెదిరించినట్టు కూడా కేసు నమోదయింది.
కల్బుర్గిలో బీజేపీ ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment