లడ్డూ ప్రసాదం
● మైసూరు యోగ నరసింహ ఆలయంలో
2 లక్షలు రెడీ
మైసూరు: జనవరి ఫస్టుకు నగరంలో విజయనగరలో ఉన్న యోగ నరసింహ ఆలయంలో ఏటా మాదిరిగా లడ్డూ ప్రసాదం అందజేయనున్నారు. ఆలయ సంస్థాపకులు భాష్యం స్వామీజీ, ఈఓ శ్రీనివాస్ నేతృత్వంలో గత నాలుగు రోజుల నుంచి రెండు లక్షల లడ్డూలు తయారవుతున్నాయి. వీఐపీల కోసం 2 కేజీల బరువుగల 10 వేల లడ్డూలు, భక్తుల కోసం 150 గ్రాముల బరువుగల 2 లక్షల లడ్ల తయారీ జరుగుతోంది. ఇందుకు 100 క్వింటాళ్ల శెనగపిండి, 200 క్వింటాళ్ల చక్కెర, 10 వేల లీటర్ల నూనె, ఒక టన్ను గోడంబి– ఎండు ద్రాక్ష, 250 కేజీల బాదామి, టన్ను కలకండ, 2 టన్నుల బూరా చక్కెర, 50 కేజీల పిస్తా, యాలకులు, జాజికాయి, పచ్చకర్పూరం, 200 కేజీల లవంగాలను వినియోగించారు. 60 మంది వంటల నిపుణులు నిమగ్నమయ్యారు. జనవరి 1న తెల్లవారుజామున 4 గంటలకు విశేష పూజల తరువాత భక్తులకు పంపిణీ చేపడతామని భాష్యం స్వామీజీ తెలిపారు.
నాటు తుపాకీతో కాల్పులు
గౌరిబిదనూరు: నాటు తుపాకీ కాల్పుల్లో వ్యక్తికి గాయాలైన సంఘటన తాలూకా తొండేబావి హోబళీ కల్లినాయకన హళ్ళి దగ్గర జరిగింది. ఈ గ్రామానికి చెందిన నంజుండ, మంజునాథ్‌ల మధ్య పొలం తగాదా ఉంది. శుక్రవారం సాయత్రం నంజుండ నాటు తుపాకీతో ఘాటీ కొండలవైపు వేటకు వెళుతున్నాడు. ఈ సమయంలో పొలం వద్ద మంజునాథ్ ఉండడం చూసి వీడియో తీయసాగాడు. దీంతో గొడవ పడ్డారు. నంజుండ నాటు తుపాకీతో కాల్చడంతో మంజునాథకు కడుపు, కాలికి గాయాలు తగిలాయి. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంచేనహళ్ళి పోలీసులు కేసు దాఖలు చేసుకొని విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment