పాన్‌ షాప్‌లోకి సిటీ బస్‌ | - | Sakshi
Sakshi News home page

పాన్‌ షాప్‌లోకి సిటీ బస్‌

Published Mon, Jan 20 2025 12:43 AM | Last Updated on Mon, Jan 20 2025 12:43 AM

పాన్‌

పాన్‌ షాప్‌లోకి సిటీ బస్‌

దొడ్డబళ్లాపురం: బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న బీడా అంగడిలోకి దూసుకెళ్లిన సంఘటన నగరంలో నాగదేవనహళ్లి రోడ్డులో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో బీఎంటీసీ ఎలక్ట్రిక్‌ బస్సు శిర్కె సర్కిల్‌ నుండి నాగరబావికి బయలుదేరింది. దారిలో బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో డ్రైవర్‌ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న పాన్‌ బీడా అంగడి, డాబా గోడను ఢీకొట్టాడు. జనం లేకపోవడంతో ఎవరికీ హాని జరగలేదు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

బెళగావిలో డీకేశి బిజి బిజీ

శివాజీనగర: జనవరి 21న బెళగావిలో కాంగ్రెస్‌ జై బాపు, జై భీమ్‌, జై రాజ్యాంగం సమావేశం జరుగుతుండగా, డీసీఎం డీ.కే.శివకుమార్‌ గత రెండు రోజుల నుండి బెళగావిలోనే ఉన్నారు. బెళగావిలో ఉన్న కపిలేశ్వర దేవాలయానికి ఆదివారం వెళ్లి పూజలు చేశారు. అర్చకుడు మంజునాథ్‌.. డీకేశికి త్రిశూలమిచ్చి ఆశీర్వాదం చేశారు. కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జిల్లా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను డీకేశి పరామర్శించారు. ఏఐసీసీ నేత సుర్జేవాలా, శివరాత్రి దేశికేంద్ర స్వామి కూడా ఆమెను పరామర్శించారు. మంత్రి సతీశ్‌ జార్కిహొళి వ్యతిరేక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్‌ సేట్‌ ఇంటికి డీకేశి వెళ్లి మాట్లాడారు. సమావేశానికి ఆహ్వానించే నెపంతో వెళ్లి, 15 నిమిషాలపాటు చర్చలు జరిపి అల్పాహారం సేవించారు. ఫిరోజ్‌ సోదరుడు, ఎమ్మెల్యే అసిఫ్‌ సేట్‌, మంత్రి ఎం.సీ.సుధాకర్‌, ఎమ్మెల్సీ చన్నరాజ హట్టిహొళి ఆయన వెంట ఉన్నారు.

చిరుత పట్టివేత

మైసూరు: గ్రామస్తులకు, రైతులకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్న చిరుత పులి బోనులోకి చిక్కింది. జిల్లాలో కేఆర్‌ నగర తాలూకాలోని మళలి అడవి ప్రాంతంలో ఉన్న హురళి కామేనహళ్ళి గ్రామంలో చిరుత బోనులోకి పడింది. చిరుత తరచూ గ్రామంలోకి వచ్చి మేకలు గొర్రెలను ఎత్తుకెళ్లేది. ప్రజలకు బయటకు రావాలంటే భయపడేవారు. దీంతో అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేయగా పలుచోట్ల బోనులను పెట్టారు. శనివారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో పడింది. దానిని దూరంగా అడవిలోకి తరలించారు.

భార్య, అత్తపై దాడి

సైకో భర్త అరెస్టు

బనశంకరి: తరచూ భార్య, అత్త పై ప్రాణాంతక దాడికి పాల్పడిన సైకో భర్తని ఆదివారం కుమారస్వామి లేఔట్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితుడు ఆసిఫ్‌. బనశంకరి సరబండెపాళ్యలోని పుట్టింటిలో భార్య హీనా కౌసర్‌ ఉంటోంది. 14వ తేదీన వెళ్లిన ఆసిఫ్‌ గొడవపెట్టుకుని భార్య, అత్త పర్వీన్‌తాజ్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఆసిఫ్‌, హీనాకు 10ఏళ్ల కిందట పెళ్లి కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఆసిఫ్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. హీనా కౌసర్‌ మరో వ్యక్తికి మెసేజ్‌ చేసిందని గమనించి అనుమానంతో ఆమెను కొట్టి 8 నెలలు క్రితం పుట్టింట్లో వదిలిపెట్టివెళ్లాడు. తరువాత కూడా మూడుసార్లు దాడిచేశాడు. తాజా దాడిలో మహిళలలిద్దరికీ తీవ్ర గాయాలు కాగా, చుట్టుపక్కల వారు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆదివారం ఆసిఫ్‌ని అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాన్‌ షాప్‌లోకి సిటీ బస్‌ 1
1/2

పాన్‌ షాప్‌లోకి సిటీ బస్‌

పాన్‌ షాప్‌లోకి సిటీ బస్‌ 2
2/2

పాన్‌ షాప్‌లోకి సిటీ బస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement