బాధలు తీర్చే భగవంతుడు
మండ్య: మన అంతరంగంలో ఉన్న బాధలను తీర్చడానికి భగవంతుడు ఉన్నాడని నాగమంగళ తాలూకాలో ఉన్న ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథస్వామి అన్నారు. మఠంలో పూర్వ పీఠాధిపతి బాలగంగాధరనాథ స్వామి 80వ జయంతి ఉత్సవాలను, 12వ వర్ధంతి మహోత్సవం నిర్వహించారు. విశేష వంటకాలు చేసి సమర్పించారు.
బడా సైబర్ నేరగాళ్ల అరెస్టు
= గత నెలలో రూ. 11 కోట్ల దోపిడీ
బనశంకరి: గత డిసెంబరు నెలలో డిజిటల్ అరెస్ట్ పేరుతో బెంగళూరు టెక్కీ నుంచి రూ.11 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లను ఈశాన్య విభాగం సీఈఎన్ పోలీసులు అరెస్ట్‌చేశారు. కరణ్, తరుణ్ నటాని, దవల్‌షా పట్టుబడ్డారు. వంచకులు టెక్కీ విజయ్‌కుమార్‌ను డిజిటల్ అరెస్ట్‌చేసి డబ్బుకు డిమాండ్ పెట్టారు. అకౌంట్‌లో రూ.2 లక్షలు ఉందని, అంతే ఇస్తానని చెప్పాడు. సరేనని ఆ మొత్తాన్ని బదలాయించుకున్నారు. తాము ఈడీ, కస్టమ్స్ అధికారులమని, మరింత సొమ్ము పంపాలని బెదిరించారు. టెక్కీ తాను పనిచేసే కంపెనీ అమెరికాలో షేర్ల గురించి వంచకులకు సమాచారం ఇచ్చాడు. టెక్కీ అకౌంట్ నంబరు, ఆధార్, పాన్‌కార్డు నంబర్లు ఇచ్చాడు. 9 అకౌంటు నంబర్లు ఇచ్చి నగదు జమచేసుకున్నారు. డిజిటల్ అరెస్టు అంటూ నెలరోజుల పాటు వేధించారు. చివరకు బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఖాతాల ఆధారంగా అలహబాద్‌లో ఒక అకౌంట్ కు రూ.7.5 కోట్లు వెళ్లినట్లు తెలిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ బంగారు వ్యాపారిని విచారించారు. దోచిన సొమ్ముతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. చివరికి వంచకులను కనిపెట్టి అరెస్టు చేశారు.
త్వరలో పెళ్లి.. అంతలోనే
మృత్యుకేళి
దొడ్డబళ్లాపురం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. మళవళ్లి తాలూకా హలగూరు గ్రామం సమీపంలోని బసాపుర గేట్ వద్ద చోటుచేసుకుంది. బళెహొన్నిగ గ్రామానికి చెందిన శరణ్య (25) గత ఏడాది నుంచి కనకపుర తాలూకా సాతనూరు పంచాయతీలో నరేగా ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఫిబ్రవరి 16న ఆమె వివాహం కూడా నిశ్చయమైంది. శనివారం సాయంత్రం స్కూటర్‌లో బళెహొన్నిగ నుంచి హలగూరుకు వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శరణ్య అక్కడికక్కడే చనిపోయింది. హలగూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment