శీతాకాలం చినుకుల వాన
శివాజీనగర: బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం వల్ల బెంగళూరులో ఆదివారం ఉదయాన్నే చిటపట చినుకుల వర్షం కురిసింది. ఇప్పటికే గడ్డ కట్టించే చలితో ప్రజలు అవస్థలు పడుతుండగా దానికి వర్షం తోడైంది. ఇళ్లు వదిలి బయటకు రావాలంటే ఇబ్బంది పడ్డారు. మునుముందు రోజుల్లో చలి మరింత అధికమవుతుందని బెంగళూరులోని భారతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు. బెంగళూరులోని కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. కోరమంగల, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, దొమ్మలూరు, హొరమావు, కిత్తగానహళ్లి, చన్నసంద్ర, శ్రీనగర, వివిపురం, జయనగర, జే.పీ.నగర, హెచ్‌ఏఎల్ విమానాశ్రయంతో పాటుగా నగరంలో అనేక లేఔట్‌లలో చిరుజల్లుల వర్షం నమోదైంది. ఆదివారం ఉదయం 5 గంటలకు ఆరంభమైన వర్షం సుమారు ఒక గంటకు పైగా కొన్ని లేఔట్‌లలో కురిసింది. 20న సోమవారం మరింత జోరు వానలు కురిసే హెచ్చరిక జారీ అయ్యింది. ఉష్ణోగ్రత కనీసం 13 డిగ్రీల సెల్సియస్, గరిష్ట 23–28 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
10 జిల్లాల్లో
తమిళనాడు, కరావళి మధ్య ఆవర్తన ప్రభావంతో బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, కోలారు, చిక్కబళ్లాపుర పరిధిలో అధిక వర్షం కురిసే ఆస్కారముంది. రాష్ట్రంలో 10 జిల్లాలకు 24 గంటల్లో వర్ష సూచనుంది. కొడగు, శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన్ భాగాల్లో దట్టంగా పొగమంచు, చలి ప్రభావం ఉంటుంది.
బెంగళూరులో పలుచోట్ల జల్లులు
నేడు పలు జిల్లాలకు సూచన
Comments
Please login to add a commentAdd a comment