● పుష్పవనం జనమయం
బనశంకరి: ఐటీ నగరిలో లాల్‌బాగ్ గ్లాస్ హౌస్‌లో ఏర్పాటైన గణతంత్ర ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను కనువిందు చేస్తోంది. ఆదికవి మహర్షి వాల్మీకి పుష్ప థీమ్ ఆధ్యాత్మికతను పంచుతోంది. శని, ఆదివారం సెలవు కావడంతో పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. నాలుగు గేట్లు వద్ద టికెట్ కౌంటర్లలో బారులు తీరారు. శనివారం ఒక్కరోజే 3.6 లక్షల మంది వీక్షించగా, టికెట్ల ద్వారా మొత్తం రూ.21.44 లక్షలు వసూలైందని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం చలి, చిరుజల్లుల మధ్య రద్దీ నెలకొంది. నగరవాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఫ్లవర్‌షో అందాలను తిలకించారు. సమాచార కేంద్రంలో ఇకెబన ఫ్లవర్ షో ఆరంభమైంది. వాల్మీకి ఆశ్రమం, రామ–సీత , లక్ష్మణ రూపాలు, కూరగాయల కళాకృతులు అలరించాయి.
వాల్మీకి విగ్రహం వద్ద జన సందడి
మదిదోచే పూల తివాచీలు
Comments
Please login to add a commentAdd a comment