దారిదీపం యోగి వేమన
బొమ్మనహళ్ళి: మహా యోగి వేమన 613వ జయంతి వేడుకలు నగరంలోని బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ 2వ సెక్టారులో ఉన్న సామసంద్రపాళ్య బెస్కాం సర్కిల్‌లో ఘనంగా జరిగాయి. బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి, కేపిసిసి నేత కే.వాసుదేవరెడ్డి పాల్గొని అక్కడి మహా యోగి వేమన విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా యోగి వేమన రాసిన పద్యాలు నేడు ఎంతో మందికి దారిదీపంగా మారాయన్నారు. నేటి యువత మహాయోగి వేమన మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. రెడ్డిజన సంఘం నేతలు మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజప్పరెడ్డి, సంతోష్, నవీన్ యువకులు పాల్గొన్నారు.
తుమకూరులో వేమన జయంతి
తుమకూరు: తుమకూరు డాక్టర్ గుబ్బి వీరన్న కళాక్షేత్రంలో జిల్లా పాలనా యంత్రాంగం, రెడ్డి జన సంఘం సహకారంతో మహా యోగి వేమన జయంతి వేడుకలు జరిగాయి. అదనపు కలెక్టర్ డాక్టర్.తిప్పేస్వామి ప్రారంభించి మాట్లాడారు. మహాయోగి వేమన వాక్యాలను ఉదాహరించారు. మన మాటల వలన మరొకరికి ఇబ్బందులు కలగరాదని, మన మాటలు కొత్త ఆలోచనలను కలిగించాలని అన్నారు. కే.శ్రీనివాస్ రెడ్డి, హిరేమఠ శివానంద శివాచార్య స్వామి సహా అనేకమంది పాల్గొన్నారు.
తుమకూరులో..
ఘనంగా జయంతి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment