● హుబ్లీలో భారీ సైబర్ మోసాలు ● మొబైల్‌కు ఫైల్ పంపి, ర
హుబ్లీ: ఏపీకే ఫైల్‌ను పంపించి స్థానిక ఓ వ్యక్తి నుంచి రూ.25.74 లక్షలను ఆన్‌లైన్ కేటుగాళ్లు దోచేశారు. వివరాలు.. స్థానికుడు ప్రవీణ్‌కుమార్ మొబైల్‌కి గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో యూనియన్ బ్యాంక్ పేరునా ఏపీకే ఫైల్‌ను పంపించారు. మళ్లీ ఫోన్ చేసి బ్యాంక్ సిబ్బంది అని, ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఏటీఎం పిన్ తదితరాలు నమోదు చేయాలని సూచించారు. బాధితుడు ఇదేదో మోసమని నిరాకరించాడు. కానీ ఫైల్ ద్వారా అతని ఖాతా నుంచి విడతల వారీగా రూ.25 లక్షలకు మొత్తాన్ని తమ ఖాతాలకు దుండగులు బదలాయించుకొన్నారు. బాధితుడు స్థానిక సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరొకరికి రూ.5.50 లక్షలు టోపీ
మరో ఘటనలో కేవైసీ అప్‌డేట్ పేరున వాట్సాప్‌కు ఏపీకే ఫైల్ లింక్ పంపించి రూ.5.50 లక్షలు వంచించారు. స్థానికుడు కె.ప్రమోద్ వాట్సాప్‌కి ఫైల్‌ని పంపించి, ఫోన్ చేసిన దుండగుడు.. డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ తెలిపారు. సరేనని అలాగే చేయడంతో అతని బ్యాంకు ఖాతాలో నుంచి మోసగాళ్లు రూ.5.50 లక్షలను బదలాయించుకొన్నారని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో ధార్వాడ వాసి వెంకటేష్ ఐఆర్‌టీసీ యాప్‌లో మూడు రైలు టికెట్లు డౌన్‌లోడ్‌లో చేసుకోగా, ఒకటి తక్కువ వచ్చింది. గూగుల్లో లభించిన హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగా, ఓ ఫారం పంపించి నింపాలని సూచించారు. అలాగే చేయగా అతని ఖాతా నుంచి కొం మొత్తంలో డబ్బు డ్రా అయ్యింది.
మైసూరులో రూ.89 లక్షలు శఠగోపం
మైసూరు: అధిక లాభాలకు ఆశపడిన ఓ వృద్ధుడు గుర్తు తెలియని వ్యక్తుల మాటల నమ్మి షేరు మార్కెట్ ద్వారా రూ.89.62 లక్షలను కోల్పోయిన ఘటన నగరంలో జరిగింది. నగరంలోని ఎన్‌ఆర్ మొహల్లాకు చెందిన వృద్ధునికి మోసగాళ్లు షేర్ ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలంటూ మెసేజ్ పంపారు. ఆశపడిన వృద్ధుడు వారిని సంప్రదించగా టాటా ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్ అనే వాట్సప్ గ్రూప్‌లో చేర్చారు. ఆ గ్రూప్‌లో సూచించిన మేరకు డబ్బులు పెట్టుబడి పెట్టారు. అయితే ప్రారంభంలో కొంత డబ్బులను లాభాలుగా చూపించారు. మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేయసాగారు. తన డబ్బు తిరిగి ఇచ్చేయమని వృద్ధుడు కోరడంతో మోసగాళ్లు అతన్ని బ్లాక్ చేశారు. రూ. 89 లక్షలకు పైగా మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏపీకే ఫైల్ అంటే..
రూ.10.50 లక్షలు స్వాహా
మైసూరులోనే మరొక కేసులో ఒకరి బ్యాంకు ఖాతా నుంచి రూ.10.50 లక్షలు వేరొకరి ఖాతాకు బదిలీ అయ్యాయి. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అని దీని పూర్తి పేరు. సంస్థలు తమ యాప్‌లను అప్‌డేట్ చేయడానికి ఏపీకేలను రూపొందిస్తాయి. చాలా తక్కువ కిలోబైట్లతో సూక్ష్మంగా ఉంటాయి. వినియోగదారులు వాటి ద్వారా అప్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇది జరుగుతుంది. కానీ మోసగాళ్లు తప్పుడు సమాచారంతో ఏపీకే ఫైళ్లను ప్రజలకు పంపుతారు. వాటిని పొరపాటున డౌన్‌లోడ్ చేసుకుంటే మాల్‌వేర్ చొరబడుతుంది. ఫోన్‌లోని సమాచారం మొత్తం మోసగాళ్లకు చేరిపోతుంది. కొన్నిసార్లు ఫోన్ కూడా వారి కంట్రోల్‌లోకి వెళ్తుంది. కాబట్టి ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేసుకోరాదని టెక్ నిపుణులు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment