చార్మాడి ఘాట్‌లో కార్చిచ్చు
బనశంకరి: ప్రకృతి రమణీయతకు నిలయమైన పశ్చిమ కనుమల్లో భాగమైన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా చార్మాడి ఘాట్‌లో కార్చిచ్చు చెలరేగింది. అనేక వందలాది ఎకరాల్లో అపురూపమైన గడ్డిభూములు, చెట్లు కాలిపోతున్నాయి. ఘాట్‌లో అణ్ణప్పస్వామి ఆలయం వద్ద అటవీప్రాంతంలో కార్చిచ్చు కొనసాగుతోంది. వందలాది ఎకరాల అడవి బూడిదైంది. గత వారం చార్మాడి ఘాట్‌లో వెదురుపొదల్లో మంటలు పుట్టి వ్యాపించాయి. వన్యజీవులు, పక్షులకు ప్రాణనష్టం సంభవించింది. గత రాత్రి మళ్లీ మంటలు ఉధృతమయ్యాయి. అటవీ, ఫైర్ సిబ్బంది అగ్నికీలలను ఆర్పే పనిలో ఉన్నారు. స్థానికులు కూడా వారికి సహకరిస్తున్నారు.
మంటలు 10 కిలోమీటర్ల మేర ఆవరించి వేడి, పొగ అలముకుంది. అటవీసిబ్బంది ఆలస్యంగా వచ్చారని స్థానికులు ఆరోపించారు. చార్మాడి ఘాట్ ఎత్తైన ప్రదేశంలో వ్యాపించి ఉంది. వేలాది వన్యజీవులు, పక్షులకు ఆవాస స్థలం. అపరూపమైన సస్యసంపద ఇక్కడ ఉంది. ఎత్తైన ప్రదేశంలో కొండలకు నిప్పుపడితే అదుపు చేయడం కష్టసాధ్యం. అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది వెళ్లలేరు.
అరుదైన వన్యసంపదకు ముప్పు
Comments
Please login to add a commentAdd a comment