ఒక్క ఓటే కదా అనుకోవద్దు
బనశంకరి: ప్రజా ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. శనివారం టౌన్‌హాల్‌లో జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమీ కాదనే ఉదాసీనత వీడాలి. ఒక్క ఓటుకు దేశ స్వరూపాన్ని మార్చే శక్తి ఉంటుందని నిజం తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. 18–24 ఏళ్ల లోపు వయసు వారు ఓటింగ్ పట్ల ఆసక్తి కనబరచకపోవడం విచారకరన్నారు. ఈ సందర్భంగా యువ ఓటర్లు, విభిన్న ప్రతిభావంతులు, బుడకట్టు ప్రజలకు ఓటరు కార్డులను గవర్నర్ అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్‌మీనా, బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలి
ఓటర్ల దినోత్సవంలో గవర్నరు గెహ్లాట్
Comments
Please login to add a commentAdd a comment