శివాజీనగర: బలవంతంగా రుణాలు వసూలు చేసే మైక్రో ఫైనాన్స్ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని, ఇకపై మూడు సంవత్సరాలకు బదులు 10 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం చేస్తామని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం బెంగళూరులో సదాశివనగర తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన జరిమానాను కూడా రూ. 5 లక్షలకు పెంచడమైనదన్నారు. రుణాల వసూళ్లకు వేధిస్తున్న మైక్రో ఫైనాన్స్ సిబ్బందికి చట్టం చురకను ముట్టించాలనే ఈ చర్యలు తీసుకొన్నామన్నారు. నామమాత్ర చట్టాలతో ఉపయోగం ఉండదు. అందుకే జరిమానా, శిక్షలను పెంచామన్నారు. కఠిన చట్టంతో వేధింపుల తగ్గుతాయని అన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల అట్టహాసానికి బ్రేక్‌లు వేయాలని ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపామని తెలిపారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయకుండా ఆర్డినెన్స్ ఉంటుందన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన తరువాత అది చట్టమవుతుంది.
మైసూరు జిల్లాలో రైతు ఆత్మహత్య
మైసూరు: సీఎం సిద్దరామయ్య సొంత జిల్లా అయిన మైసూరు జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది పీడించడం వల్ల అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హెచ్‌డి కోటె తాలూకాలోని కుణియనహుండి గ్రామంలో జయరాం (55) రైతు, ఈక్విటాల్, జనబ్యాంకు మైక్రో ఫైనాన్స్‌ల నుంచి రూ. 5 లక్షలు అప్పులు చేశాడు. ఇద్దరు కూతుళ్లు కాగా వారికి పెళ్లిళ్లు చేశాడు. చివరికి అప్పుల బాధ, వేధింపులు పెరగడంతో విరక్తి చెంది పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.
వేధిస్తే 10 ఏళ్ల జైలు,
రూ.5 లక్షల జరిమానా
హోంమంత్రి పరమేశ్వర్ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment