మైసూరు: వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొని రైతు దంపతులు దుర్మరణం పాలైన ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె పట్టణంలో జరిగింది. గుండ్లుపేటె పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ నివాసులైన విశ్వనాథ్ (65), భాగ్య(48) మృతులు. వీరు పొలంలో పని ముగించుకుని వాపసు వస్తుండగా నగర శివార్లలోని ఐటీఐ వద్ద ఊటీ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ప్రమాద తీవ్రతకు ఒకరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. గుండ్లుపేటె టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment