కట్టుకున్నోళ్లే కాటికి పంపారు
చిక్కబళ్లాపురం: కుటుంబ కలహాలు, ఇతరత్రా కారణాలతో వేర్వేరు చోట్ల భార్యల చేతిలో భర్తలు హతమయ్యారు. చిక్కబళ్లాపురం, చామరాజనగరలో ఈ ఘోరాలు జరిగాయి. వివరాలు.. చిక్క తాలూకా పరిధిలోని గౌచేనహళ్లికి చెందిన సుభాష్ (35), అదే గ్రామానికి యువతితో వివాహమైంది. మొదట్లో బాగానే ఉండేవారు. అయితే సుభాష్ ఇతర మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగేవాడు. ఇది సహించలేని భార్య ప్రశ్నించడంతో రభస జరిగేది. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో ఆమె తన తమ్మునికి మొరపెట్టుకుంది. మంగళవారం అతడు ఐదు మంది స్నేహితులతో కలిసి చాకు, బండరాళ్లతో దాడి చేసి సుభాష్‌ను మట్టుబెట్టారు. సుభాష్ బంధువులు చిక్కబళ్లాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ శివకుమార్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వేర్వేరు చోట్ల భార్యల చేతిలో
భర్తల హత్యలు
Comments
Please login to add a commentAdd a comment