చెత్త స్కాం.. రూ.కోట్లు స్వాహా
బనశంకరి: బెంగళూరు గాంధీనగర నియోజకవర్గంలో చెత్త తరలింపులో కోట్లాది రూపాయలు దోచేశారని బీజేపీ నేత ఎన్‌ఆర్.రమేశ్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేశారు. బెంగళూరు పాలికెలోని 27 నియోజకవర్గాలలో చెత్త తరలింపునకు ప్రతి వార్డులో నెలకు రూ.15– 16 లక్షలు ఖర్చవుతుంటే, గాంధీనగరలో మాత్రం వార్డుకు సరాసరి రూ.36.73 లక్షలు అవుతోందని చెప్పారు. నియోజకవర్గంలోని 7 వార్డుల్లో నెలకు రూ.2.57 కోట్లను ఖర్చుచేస్తున్నారని, ఒకే ఏడాదిలో రూ.30.85 కోట్లను వ్యయం చేశారని, ఇందులో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవాలని అన్నారు.
బంధువులకే కాంట్రాక్టులు
నియోజకవర్గంలో చెత్త తరలింపు పనులు చేపట్టే కూలీలు, సిబ్బంది అందరూ బీబీఎంపీ ఉద్యోగుల బంధువులే కావడం గమనించాలన్నారు. జూనియర్ ఆరోగ్యశాఖ పర్యవేక్షకుడు కృష్ణ అనే ఉద్యోగి భార్య సునీత చెత్త తరలింపు కాంట్రాక్టు తీసుకున్నారని, అతని బావమరిది గతేడాది రూ.25 లక్షలు డ్రా చేశారని చెప్పారు. ఇలా పలువురు ఉద్యోగుల కుటుంబ సభ్యులు చెత్త కాంట్రాక్టులను వివరించారు. అవినీతికి పాల్పడిన పాలికె అధికారులు, కాంట్రాక్టర్లపై విచారణ జరిపి నగదును తిరిగి రాబట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
బీబీఎంపీ ఉద్యోగుల దందా
బీజేపీ నేత రమేశ్ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment