![కళ్యాణ కర్ణాటకకు కాంగ్రెస్ అన్యాయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12blr12-120011_mr-1739414083-0.jpg.webp?itok=Je7yzex1)
కళ్యాణ కర్ణాటకకు కాంగ్రెస్ అన్యాయం
రాయచూరు రూరల్: హైదరాబాద్ కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ, ఆ సర్కార్ నుంచి అన్యాయం జరిగిందని హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టిగి ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కర్ణాటక పరిధి అంటే కేవలం కలబుర్గి ప్రధాన కేంద్రంగా భావించి కలబుర్గికి మెగా టెక్స్‌టైల్ పార్కు, జయదేవ, ఈఎస్‌ఐ, క్యాన్సర్ ఆస్పత్రులను తరలించుకెళ్లారన్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదన్నారు. ఇతర జిల్లాల వారే జిల్లాకు ఇంచార్జి మంత్రులుగా వ్యవహరిస్తు అతిథి దేవోభవ అంటున్నారన్నారు.
ఇలా వచ్చి అలా వెళుతున్నారు
వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ జిల్లాకు ఇలా వచ్చి అలా వెళుతున్నారని దుయ్యబట్టారు. విద్యా శాఖ కమిటీలో కలబుర్గికి ఐదు మంది, బీదర్, బళ్లారిలకు ఇద్దరేసి చొప్పున నియమించి మిగిలిన జిల్లాకు మొండి చేయి చూపారన్నారు. రాయచూరు జిల్లాలోని ఎంపీ, శాసన సభ్యులు, విధాన పరిషత్ ిసభ్యులు మౌనం వహించడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా శాఖ కమిటీలో కొప్పళ, రాయచూరు, విజయనగర, యాదగిరి జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా కేబినెట్ హోదా కలిగిన మంత్రిని నియమించాలన్నారు.
నోరు మెదపని జిల్లా ప్రజాప్రతినిధులు
ఇతర జిల్లాల వారే ఇంచార్జి మంత్రులు
Comments
Please login to add a commentAdd a comment