సొగసుగా.. ఆకాశ వేడుక
దొడ్డబళ్లాపురం/ బనశంకరి: వైవిధ్యభరితమైన విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శన, ఆకాశంలో వాటి విన్యాసాలు మూడవరోజు బుధవారం కూడా సంభ్రమపరిచాయి. బెంగళూరు యలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా– 2025 ప్రదర్శన ఉత్సాహభరితంగా సాగుతోంది. భారత సూర్యకిరణ్ విమానాలు రంగురంగుల పొగలు చిమ్ముతూ ఆకాశంలో విన్యాసాలతో అలరించాయి. సుఖోయ్, గ్లోబ్ మాస్టర్, తేజస్, హెచ్‌ఏఎల్ లఘు యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శన అబ్బురపరచింది. వీటితో పాటు భారీ సరుకు రవాణా విమానాలు, ప్రయాణికుల విమానాలు ఆకట్టుకున్నాయి. జనంతో యలహంక పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. చుట్టుపక్కల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
గతం కంటే చప్పగా?
మరోవైపు ఎయిర్ షో గతం కంటే చప్పగా ఉందనే విమర్శలు వచ్చాయి. రష్యా, భారత విహంగాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాల నుంచి యుద్ధ విమానాలు ఎక్కువగా రాలేదు. ఉక్రెయిన్ యుద్ధం తదితర పరిణామాలే కారణమని భావిస్తున్నాయి.
మూడవ రోజుకు ఏరో ఇండియా
సందర్శకుల సందడి
సొగసుగా.. ఆకాశ వేడుక
సొగసుగా.. ఆకాశ వేడుక
సొగసుగా.. ఆకాశ వేడుక
సొగసుగా.. ఆకాశ వేడుక
Comments
Please login to add a commentAdd a comment