![వడ్డీ తిమింగలం!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12bng31-120014_mr-1739414201-0.jpg.webp?itok=lywR0KX9)
వడ్డీ తిమింగలం!
● ఇంట్లో రూ. 5 కోట్లు సీజ్
సాక్షి, బళ్లారి: రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ వ్యాపారుల జోరును అడ్డుకునేందుకు పోలీసులతో దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం గదగ్ జిల్లాలో ఓ వడ్డీ వ్యాపారి ఇంట్లో ఏకంగా రూ.5 కోట్ల నగదు, బంగారును పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ప్రముఖ వడ్డీ వ్యాపారి యల్లప్ప మిస్కిన్ చెందిన పలు నివాసాల్లో తనిఖీ చేయగా రూ.5 కోట్ల నగదు, కేజీ బంగారం లభించింది. వీటితో పాటు 650 బాండ్లు, నాలుగు ఏటీఎం కార్డులు, 9 బ్యాంక్ పాస్ బుక్‌లు, 65 లీటర్ల మద్యం సీసాలు కూడా దొరికాయి. వడ్డీ వ్యాపారి ఇంత పెద్ద స్థాయిలో నగదు ఇంట్లో ఉంచుకొని లావాదేవీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దాడులు, స్వాధీనాలు నిజమేనని గదగ్ జిల్లా ఎస్పీ నేమకగౌడ తెలిపారు.
కూలిన కొండచరియలు
దొడ్డబళ్లాపురం: ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా కొడ్లగద్దె వద్ద బుధవారంనాడు హఠాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామ సమీపంలోని వక్క తోట వద్ద పెద్ద పెద్ద కొండ రాళ్లు పడిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి హాని జరగలేదు. నీటి కాలువలకు అడ్డంగా పడడంతో చుట్టుపక్కల తోటలకు, పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఎప్పుడు కొండరాళ్లు పడతాయోనని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment