బెంగళూరును విభజించి.. పాలించు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు పాలక బిల్లు తయారు గురించి కమిటీ రెండవరోజు కసరత్తు సాగించింది. శాసనసభ ఉమ్మడి పరిశీలనా కమిటీ అధ్యక్షుడు రిజ్వాన్ హర్షద్ ఆధ్వర్యంలో ప్రజలతో సమావేశాలు జరిగాయి. బుధవారం యలహంక, దాసరహళ్లి వలయాల ప్రజలతో అంబేడ్కర్ భవన్‌లో సలహా సమాశాన్ని నిర్వహించారు. రిజ్వాన్ హర్షద్ మాట్లాడుతూ బృహత్ బెంగళూరులో బిల్లులో ఉన్న అంశాలు అంతిమం కాదని, చాలా సమావేశాలు జరిపి కూలంకుషంగా చర్చించామన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న బెంగళూరు నగరానికి ఒక మేయర్, ఒక కమిషనర్ తో పాలన అందించడం సాధ్యం కాదని చెప్పారు. స్థానికంగా పలు నగర పాలికెలను నిర్మిస్తే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించవచ్చునని తెలిపారు. నగర ప్రజలు అందించే సలహాలు, సూచనలను గ్రేటర్ బెంగళూరు బిల్లులో చేరుస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న బెంగళూరు పాలికె పాలన ఏ విధంగా నడుస్తోంది, నగరవాసులకు ఏమేరకు సహాయం అందుతోంది అనేదానిపై మనందరం ఆలోచించాలన్నారు. కమిషనర్ తుషార్ గిరినాథ్ మాట్లాడుతూ గ్రేటర్‌బెంగళూరు పాలన బిల్లు, పథకాలు, విధుల గురించి వివరించారు. గ్రేటర్ బెంగళూరు బిల్లు గురించి ప్రజలు బీబీఎంపీకి మెయిల్ ద్వారా కూడా సలహాలు ఇవ్వవచ్చని తెలిపారు.
ఒక్క మేయర్, కమిషనర్ సరిపోరు
గ్రేటర్ అవసరం చాలా ఉంది
ప్రజా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు
ప్రజల నుంచి అందిన కొన్ని సలహాలు ఇలా ఉన్నాయి
పాలనా దృష్టితో గ్రేటర్ బెంగళూరును ఏర్పాటు చేయడం మంచిదే
దీనివల్ల బెంగళూరు అస్తిత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు
పాలకవర్గం విస్తరణ వల్ల స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చు
గ్రేటర్ బెంగళూరు అశాసీ్త్రయం. దీనిని తక్షణం నిలిపివేసి, వెంటనే కార్పొరేషన్ ఎన్నికలు జరపాలి
నగర పాలికెలను పెంచడానికి బదులు వలయాలను పెంచాలి
బెంగళూరును ఎట్టి పరిస్థితిలో విభజన చేయరాదు
గ్రేటర్ బెంగళూరు బిల్లులో విపత్తుల నిర్వహణను సమర్థంగా చేపట్టాలి
గ్రేటర్ బెంగళూరు రావడం ఉత్తమం. సక్రమంగా అమల్లోకి తీసుకురావాలి.
ఈ సమావేశంలో బీబీఎంపీ పాలనాధికారి ఎస్‌ఆర్ ఉమాశంకర్, వలయ కమిషనర్లు సతీశ్, కరిగౌడ, జాయింట్ కమిషనర్లు పాల్గొన్నారు.
బెంగళూరును విభజించి.. పాలించు
బెంగళూరును విభజించి.. పాలించు
Comments
Please login to add a commentAdd a comment