సింగరేణి క్రీడా క్యాలెండర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

సింగరేణి క్రీడా క్యాలెండర్‌ విడుదల

Published Thu, Aug 29 2024 12:56 AM | Last Updated on Thu, Aug 29 2024 12:56 AM

-

సింగరేణి(కొత్తగూడెం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సింగరేణి వ్యాప్తంగా ఏరియాల్లో నిర్వహించనున్న క్రీడాపోటీల క్యాలెండర్‌ను ఇటీవల విడుదల చేశారు. అయితే, ఈ జాబితాలో పేర్కొన్న తేదీల్లో కోలిండియా స్థాయి పోటీలను ప్రకటిస్తే షెడ్యూల్‌లో మార్పులు చేస్తామని జీఎం పర్సనల్‌(వెల్ఫేర్‌ అండ్‌ ఆర్సీ) సామ్యేల్‌ సుధాకర్‌ తెలిపారు. ఈమేరకు ఆర్జీ–2 ఏరియాలో సెప్టెంబర్‌ 17, 18వ తేదీల్లో షటిల్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు నిర్వహిస్తారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో సెప్టెంబర్‌ 19, 20వ తేదీలలో వాలీబాల్‌, కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో సెప్టెంబర్‌ 24, 25వ తేదీలలో బాడీబిల్డింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌(మెన్‌), పవర్‌ లిఫ్టిగ్‌ (మెన్‌ అండ్‌ ఉమెన్‌), ఇల్లెందు ఏరియాలో అక్టోబర్‌ 15, 16 తేదీ ల్లో లాన్‌ టెన్నిస్‌, బాస్కెట్‌ బాల్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఇక ఆర్జీ–1 ఏరియాలో అక్టోబర్‌ 22, 23వ తేదీల్లో కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్‌, మందమర్రి ఏరి యాలో నవంబర్‌ 5, 6వ తేదీలలో ఫుట్‌బాల్‌, కొత్తగూడెం ఏరియాలో నవంబర్‌ 12, 13వ తేదీల్లో కల్చ రల్‌ మీట్‌, మణుగురు ఏరియాలో నవంబర్‌ 19, 20వ తేదీల్లో హాకీ, భూపాలపల్లి ఏరియాలో నవంబర్‌ 26, 27వ తేదీల్లో క్యారమ్స్‌, చెస్‌, ఆర్జీ–3 ఏరి యాలో డిసెంబర్‌ 10, 11వ తేదీలలో అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, త్రోబాల్‌(ఉమెన్‌), బెల్లంపల్లి ఏరియాలో డిసెంబర్‌ 17నుంచి క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్లు జీఎం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement