తండ్రిని చంపిన కుమారుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపిన కుమారుడి అరెస్ట్‌

Published Thu, Aug 29 2024 12:56 AM | Last Updated on Thu, Aug 29 2024 12:56 AM

-

మణుగూరుటౌన్‌: పగిడేరు గ్రామంలోని మేకల (కొర్సా) బుచ్చిరాములును కర్రలతో కొట్టి చంపిన కుమారుడు సూర్యంను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను సీఐ సతీశ్‌కుమార్‌ వెల్లడించారు. సూర్యంకు 20 ఏళ్ల కిందట బయ్యారం మండలం బోటుగూడెంనకు చెందిన మహిళతో పెళ్లి జరిగింది. కొన్ని కారణాలరీత్యా 8 ఏళ్ల కిందట ఆమె పుట్టింటికి వెళ్లింది. మద్యానికి బానిసైన నిందితుడు తల్లిదండ్రుల ఆస్తిలోని ఆరు ఎకరాల్లో వాటా ఇవ్వాలని గొడవ పడుతున్నాడు. దీనికి నిరాకరించిన తండ్రి మనవరాళ్లకి, మనవడికి సమానభాగం ఇస్తానని చెబుతుండటంతో తండ్రిని చంపితే ఆస్తి మొత్తం తనదవుతుందని భావించి సూర్యం పథకం ప్రకారం పొలం వద్ద పనులు చేసుకుంటున్న తండ్రి బుచ్చిరాములును మంగళవారం మధ్యాహ్నం కర్రలతో కొట్టి హతమార్చి భయంతో పారిపోయాడని సీఐ చెప్పారు. పేరంటాలచెరువు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించామని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement