కొండరెడ్ల అభివృద్ధికి కృషి
అశ్వారావుపేట: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని కొండరెడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వెల్లడించారు. దమ్మపేట మండలం గోగులపూడి, దమ్మపేట మండలం పూసుకుంట కొండరెడ్ల గ్రామాలను మంగళవారం ఆయన సందర్శించారు. రూ.16లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను శుభకార్యాలకు వినియోగించుకోవాలని సూచించిన పీఓ, విద్యావంతులైన యువత ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. పూసుకుంటలో విద్యుత్ సౌకర్యం అవసరమైన పట్టా భూములు, డెయిరీ, గోబర్‌గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు, మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు, శిథిలమైన ఇళ్ల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత అశ్వారావుపేట మండలం గోగులపూడిలో రూ.15లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన వెదురు కళాకృతులను పరిశీలించిన పీఓ ఐటీడీఏ ద్వారా మార్కెటింగ్ చేయించి కొండరెడ్లకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. విద్యావంతులు సబ్సిడీ రుణాలు పొంది ఉపాధి పొందడంతోపాటు మరి కొందరికి అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఐడీడీఈ ఈఈ తానాజీ, ఏపీఓ పవర్ ఏఈ మునీర్ పాషా, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment