వచ్చేనెల 1న ‘జన భోజనాలు’
ఖమ్మంమయూరిసెంటర్: ‘కుల భోజనాలు వద్దు.. జన భోజనాలు చేద్దాం రండి’ నినాదంతో వచ్చేనెల 1న సకల జనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆవుల అశోక్, స్పర్శ అధ్యయన వేదిక బాధ్యులు కాకి భాస్కర్ తెలిపారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వారు మాట్లాడారు. కార్తీక మాసంలో కులాల ఆధారంగా వనభోజనాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈనేపధ్యాన ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా సకల జన భోజనాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాల వెనకాల మామిడి తోటలో వచ్చేనెల 1న జరిగే జన భోజనాలకు మేధావులు, ప్రజాస్వామికవాదులు హాజరుకావాలని కోరారు. నాయకులు ఝాన్సీ, సీహెచ్.శిరోమణి, కొల్లేటి నాగేశ్వరరావు, కె.శ్రీనివాస్, మంగతాయి, శోభ, లక్ష్మణ్, తేజ నాయక్, రాకేష్, వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment