ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ బాధ్యులు మంగళవారం హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యాన ఖమ్మం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల అల్పాహారం అందిస్తామని ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సంస్థ వారికి కిచెన్ షెడ్డు నిర్మాణం, ఇతర వనరులు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ను ఫోన్లో ఆదేశించారు. సంస్ధ బాధ్యులు కౌటిల్యదాస్, రవి సులోచనాదాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment