అసిస్టెంట్ ఇంజనీర్లకు పోస్టింగ్ ఇవ్వాలి
పాల్వంచ: పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యాన 339 అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి రాతపరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసినందున త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని కేటీపీఎస్ 5, 6వ దశల బ్రాంచ్ కార్యదర్శి డి.ఉమామహేశ్వరరావు కోరారు. ఈ సందర్భగా మంగళవారం సీఈ ఎం.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యదర్శి దర్బంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు బదిలీలు చేపట్టడంతో పాటు కేటీపీఎస్ 5, 6వ దశల్లో ఖాళీగా ఉన్న 57 ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేయాలన్నారు. అసోసియేషన్ నాయకులు జయభాస్కర్, చంద్రకళాధర్, పావని, ఎన్.ప్రదీప్, టి.దివాకర్, కె.మధుసూదన్, బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టు పార్టీ
దళ సభ్యుడు లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: మావోయిస్టు పార్టీ బెటాలి యన్ దళ సభ్యుడు, రూ.లక్ష రివార్డు కలిగిన మడవి అయిత అలియాస్ మంగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జీలోరుగడ్డకు చెందిన మంగు 2020లో హిడ్మా నాయకత్వాన మావోయిస్టుల్లో చేరగా ఆ రాష్ట్రంలో జరిగిన పలు విధ్వసంకర సంఘటనల్లో పాల్గొన్నాడని ఎస్పీ తెలిపారు. కాగా, ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో ఆయన జిల్లా పోలీసులు, 141 బెటాలియన్, ఆర్‌ఎఫ్‌టీ, సీఆర్‌పీఎఫ్ అధికా రుల ఎదుట లొంగిపోయాడని వెల్లడించారు. కాగా, ప్రశాంత జీవనం గడపాలనుకునే మావో యిస్టులు తమ బంధువుల ద్వారా కానీ నేరుగా కానీ లొంగిపోవాలని ఎస్పీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment