సింగరేణి పాఠశాలల్లో ఒలింపియాడ్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి పాఠశాలల్లో ఒలింపియాడ్‌

Published Wed, Nov 20 2024 1:04 AM | Last Updated on Wed, Nov 20 2024 1:04 AM

-

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా తొమ్మిది పాఠశాలల్లో విద్యార్థులు సామర్‌ాధ్యలు పెంపొందించి, ప్రస్తుత పోటీ ప్రపంచంలో సత్తా చాటేలా ఒలింపియాడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఒలంపియాడ్‌ నిర్వహించే సంస్థ ‘యునిఫైడ్‌ కౌన్సిల్‌’ ప్రతినిధి కె.శ్రీధర్‌తో కలిసి ఇటీవల ప్రణాళిక రూపొందించారు. పోటీపరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా ఈ విధానం ద్వారా మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెం, భూపాలపల్లి, శ్రీరాంపూర్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమిటీని కూడా నియమించారు.

మూడు దశల్లో...

ప్రస్తుత విధానంలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులే పరీక్ష నిర్వహించి వారే దిద్దుతారు. కానీ ఒలింపియాడ్‌ విధానంలో పాఠాలు చెప్పడం, ప్రశ్నపత్రం తయారుచేయడం, వాల్యూయేషన్‌ ఇలా మూడు ముగ్గురితో చేయిస్తారు. ఆపై విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఏ స్థాయిలో ఉన్నారు, వారిని మరింతగా తీర్చిదిద్దడం ఎలా అనే అంశంపై సమీక్షిస్తారు. ఇలా థర్డ్‌పార్టీ ఆధ్వర్యాన జరిగే ప్రక్రియను కోఆర్డినేటర్లు పరిశీలిస్తుంటారు. కాగా, ఏ పోటీ పరీక్షకై నా కొంత రుసుము చెల్లించాల్సి ఉండడంతో తల్లిదండ్రుల సంసిద్ధతపై ఒలింపియాడ్‌ విధానం నిర్వహణ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై సింగరేణి ఎడ్యుకేషన్‌ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు పోటీపరీక్షల్లో ప్రతిభ చాటేలా తీర్చిదిద్దేందుకు ఒలింపియాడ్‌ విధానం అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల్లో సామర్థ్యాలు

పెంపొందించడమే లక్ష్యం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement