టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు
భద్రాచలంటౌన్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా బుటారి రాజు ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాల క్రాఫ్ట్ ఉపాధ్యాయుడు బుటారి రాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు సంఘం పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. కాగా, రాజును టీపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు జి.హరిలాల్, కె.ముత్తమ్మ, బి.ప్రసాదరావు, కె.మాధవరెడ్డి, జె.రాంబాబు, టి.సత్తిబాబు, జె.సరళ, వి.సరియ, జె.మహేశ్, బి.రమేశ్, డి.ఉమాదేవి జి.కిషన్, ఎస్.కృష్ణబాబు, బి.హన్మంతు, ఆసియా తదితరులు అభినందించారు.
నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీకి చెందిన భక్తుడు మంగళవారం విరాళం అందజేశారు. విజయవాడలోని రామకృష్ణాపురానికి చెందిన నర్సింహమూర్తి రూ.లక్ష చెక్కును ఆలయ ఉద్యోగులకు అందించి, స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల
పీఎఫ్‌పై సమీక్ష
మణుగూరు టౌన్: సింగరేణి కార్మికుల భవిష్య నిధి(పీఎఫ్)పై సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ కనకమ్మ మంగళవారం సమీక్షించారు. మణుగూరులో జరిగిన ఈ సమావేశంలో ఎస్‌ఓటూ జీఎం శ్యాంసుందర్ మాట్లాడుతూ రిటైర్ అయిన కార్మికుల సీఎంపీఎఫ్, పెన్షన్ ప్రక్రియ పూర్తిచేయాలని, ఆడిట్ షీట్లలో వడ్డీ రేట్లు పొందుపరచాలని కోరారు. కమిషనర్ కనకమ్మ మాట్లాడుతూ సీఎంపీఎఫ్, సీఎంపీఎస్ త్వరగా చెల్లించేలా అమల్లోకి తీసుకొచ్చిన సీ–కేర్స్ పోర్టల్‌లో అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు. అలాగే, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనం నుంచి సీఎంపీఎఫ్ రికవరీ చేయాలన్నారు. అధికారులు, నాయకులు వీరభద్రుడు, రమేశ్, అనురాధ, శేషగిరి, మదన్‌నాయక్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, అవినాష్, రాంగోపాల్, కృష్ణంరాజు, సింగు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment