మమత ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో 80 ఏళ్ల వృద్ధుడికి మెదడు సంబంధిత శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా విజయవంతంగా చేసినట్లు మమ త ఆస్పత్రి కార్యదర్శి పువ్వాడ జయశ్రీ, న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆస్పత్రిలో వారు వివరాలు వెల్లడించారు. చింతకాని మండలం పొద్దటూరుకు చెందిన వృద్ధుడు జి.వెంకయ్య మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. ఈ మేరకు అరుదైన శస్త్రచికిత్స చేయాల్సి ఉండటంతో హైదరాబాద్ వంటి నగరాల్లో రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. కానీ, ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిచేసినట్లు వెల్లడించారు. తల వెనక భాగంలో కండరాల మధ్య నుంచి శస్త్రచికిత్స చేయగా వెంకయ్య పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వామి, ప్రిన్సిపాల్ అనురాధ పాల్గొన్నారు.
80 ఏళ్ల వృద్ధుడికి
ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్
Comments
Please login to add a commentAdd a comment