జనభోజనాలను జయప్రదం చేయండి
ఖమ్మంమామిళ్లగూడెం:కులమతాలకతీతంగా మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యాన డిసెంబర్ 1న ఖమ్మం పాండురంగాపురంలోని మలీదు జగన్ మామిడితోటలో జనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ శిరోమణి తెలిపారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కులాల వారీగా భోజనాల సంస్కృతిని వ్యతి రేకించి ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేలా నిర్వ హిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరారు. సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోకినపల్లి లలిత, ఆవుల మంగతాయి తో పాటు ప్రతాప్, శోభ, టి.ఝాన్సీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment