అందుబాటులోకి సీఎస్‌సీ వాహన సేవలు
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో అమల్లోకి వచ్చిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) వాహనం ద్వారా పకడ్బందీగా సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లాకు కేటాయించిన వాహనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటుచేయగా ప్రజలకు వైద్య, విద్య, ఉపాధి తదితర రంగాల్లో సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు వాహనాన్ని సమకూర్చారని, ఈ వాహనం ద్వారా నిర్దేశిత తేదీల్లో గ్రామాల్లోనే సేవలందిస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేయగా జాబితాలో ఖమ్మం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, డీఆర్వో రాజేశ్వరి, ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ షేక్ ఫయాజ్, ఈడీఎం దుర్గాప్రసాద్, జిల్లా మేనేజర్ పి.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిపై దాడి ఘటనలో కుమారుడిపై కేసు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని గడ్డికుంటతండాలో తల్లిపై దాడి చేసిన కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. గడ్డికుంట తండాకు చెందిన గుగులోత్ లాలీపై ఆమె కుమారుడు రాజు మద్యం మత్తులో కర్రతో దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment