చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
నేలకొండపల్లి: రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యం చివర గింజ వరకు కొనుగోలు చేస్తామని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. జిల్లాలో డీసీఎంఎస్ ద్వారా 29 కేంద్రాలు ఏర్పాటుచేయగా, ఇప్పటివరకు దాదాపు 2లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. సన్నధాన్యం అమ్మిన రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రసుత్త వాతావరణంలో మార్పులు వస్తున్న సందర్భంగా ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ కె.సందీప్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, కార్యదర్శి నాగేశ్వరి, సూపర్‌వైజర్ భాస్కర్‌తో పాటు సొసైటీల చైర్మన్లు, సీఈఓలు గూడవల్లి రాంబ్రహ్మం, అనంతు కాశయ్య, ఏ.నాగేశ్వరరావు, జగదీష్ దితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment