ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి
రఘునాఽథపాలెం: గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాఽథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టే అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లోని అటవీ భూముల్లో మొక్కలు నాటించాలని, తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే, శ్మశాన వాటికల్లో సమస్యల పరిష్కారం, అవసరమైన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో ఉన్న నిధులతో దశలవారీగా అవసరమైన పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ విల్సన్, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, డీఈ మహేష్, ఏఈ చిరంజీవి, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, యరగర్ల హన్మంతరావు, వాంకుడోత్ దీపక్, కేలోత్ దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment