వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
పాల్వంచరూరల్: దేవాలయ పవిత్రత, భక్తుల సర్వశ్రేయస్సు కోసం మూడు రోజులపాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు, వేదపండితులు, రుత్వికులు మొదట అమ్మవారి సన్నిధిలో గణపతిపూజ, స్వస్తి పుణ్యావాచనం, పంచగవ్యప్రాసన, దీక్షాకంకణధారణ పూజలు జరిపారు. అనంతరం యాగశాలలో శోడషస్తంభ పూజ, అఖండ దీపారాధన, సప్తశోడష మాతృక పూజ, సర్వతో భద్రమండపారాధన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మంగళవాయిద్యాలతో అర్చకులు, భక్తులు పుట్టవద్దకు వెళ్లి మృత్తికా సంగ్రహణం చేసి యాగశాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment