క్రిస్మస్ సందర్భంగా ఖమ్మం వైరారోడ్డు చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులు
జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. గత అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ప్రార్థనలు బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగాయి. మత పెద్దలు దైవ సందేశాన్ని అందించగా భక్తులు కేక్‌లు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. యేసు ప్రభువు జన్మ వృత్తాంతాన్ని, ఆయన త్యాగాలను ఫాదర్లు, పాస్టర్లు వివరించారు. పలు చర్చిల్లో భక్తి గీతాలను ఆలపించారు.
మధిర మండలం బయ్యారంలోని కేథలిక్ చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేక్ కట్ చేసి మాట్లాడగా, ఖమ్మం చర్చికాంపౌండ్‌లోని సీఎస్‌ఐ చర్చిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment